Dhurandhar: పది రోజుల్లో 550 కోట్లు.. టార్గెట్ 1000 కోట్లు..!
on Dec 15, 2025

'ధురంధర్' బాక్సాఫీస్ ఊచకోత
పది రోజుల్లోనే 550 కోట్ల గ్రాస్
నెక్స్ట్ టార్గెట్ 'ఛావా'
ఫుల్ రన్ లో వెయ్యి కోట్లు?
ప్రస్తుతం బాలీవుడ్ లో 'ధురంధర్'(Dhurandhar) పేరు మారుమోగిపోతోంది. డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. కేవలం పది రోజుల్లోనే రూ.500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది.
ఈ ఏడాది 500 కోట్ల క్లబ్ లో చేరిన మూడవ హిందీ సినిమా 'ధురంధర్' కావడం విశేషం. ఫిబ్రవరిలో విడుదలైన 'ఛావా' ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.800 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక జులైలో విడుదలైన 'సైయారా' కూడా రూ.580 కోట్లతో సత్తా చాటింది. ఇప్పుడు 'ధురంధర్' పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పటిదాకా ఇండియాలో రూ.430 కోట్లు రాబట్టగా, ఓవర్సీస్ లో రూ.120 కోట్లు రాబట్టింది.
Also Read: బాలయ్య తాండవం.. అఖండతో ఓవర్సీస్ లో సంచలన రికార్డు!
రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ ప్రధాన పాత్రలు పోషించిన 'ధురంధర్' చిత్రానికి ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈ స్పై థ్రిల్లర్ విడుదల రోజు పరవాలేదు అనే టాక్ తో సరిపెట్టుకుంది. ఆ తరువాత మౌత్ టాక్ తో రోజురోజుకి వసూళ్ళను పెంచుకుంటూ సంచలనాలు సృష్టిస్తోంది.
'ధురంధర్' బాక్సాఫీస్ జోరు ఇప్పట్లో ఆగేలా లేదు. ఇప్పుడు థియేటర్లలో ఇతర భారీ హిందీ చిత్రాల తాకిడి లేదు. పైగా, 'ధురంధర్' మౌత్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర స్టడీగా రన్ అవుతోంది. మరో రెండు వరాల వరకు ఇదే జోరు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే త్వరలో 'ఛావా'ను క్రాస్ చేయడమే కాకుండా.. రూ.1000 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యం లేదనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. చూద్దాం మరి.. ఫుల్ రన్ లో 'ధురంధర్' ఎంత కలెక్ట్ చేస్తోందో.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



